బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన చిత్రం జీరో ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచం మొత్తం విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందు జీరో ట్రైలర్ తో ఆకట్టుకున్నాడు. సినిమా పైన అంచనాలు కుడా అమాంతం పెరిగేశాయి. అంచనాలకు మించి విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాని చవిచూసింది. స్టార్ హీరోయిన్స్ కత్రినాకైఫ్, అనుష్క శర్మ నటించిన ఈ చిత్రం ఏమాత్రం కూడా నిలబడలేక పోయింది. మొదటి రోజు షో నుండి నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. జీరో సినిమా క్రిస్మస్ సెలవలను క్యాష్ చేసుకోవాలని శుక్రవారం నాడు విడుదలచేశారు. మొదటి రోజు 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అందరు ఆశించారు కానీ సినిమా పై నెగటివ్ టాక్ తో కనీసం 50 కోట్లు కు కూడా చేరుకోలేకపోయింది.
శుక్ర, శని వారాల మొత్తం కలెక్షన్స్ 38 కోట్ల 36 లక్షలు. నెట్ మాత్రమే వచ్చింది. సోషల్ మీడియాలో అండ్ రివ్యూస్ లో జీరో సినిమా పై నేటిజన్స్ దుమ్ము ఎత్తి పోస్తున్నారు. జీరో మూవీ కన్న థగ్స్ అఫ్ హిందూస్తాన్ చాలా బెట్టర్ అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఢిల్లీ పూణే, ముంబాయి, హైదరాబాద్ వంటి మహానగరాల్లోని మల్టీ ఫ్లెక్స్ లో ఈ సినిమా కనీసం హౌస్ ఫుల్ కూడా అవ్వడం లేదు. ఇండియా మొత్తం మిధ 4380స్క్రీన్స్ పైన విడుదలచేశారు. అన్ని స్క్రీన్స్ పైన విడుదలైన కూడా కలెక్షన్స్ పరంగా జీరో అంటున్నారు. సినిమా విశ్లేషకులు. జీరో సినిమా చూడటం కన్న అక్వమేన్, 2.౦ చిత్రాలు చూడటం బెటర్ అంటున్నారు. ఈ చిత్రం పరాజయంతో షారుఖ్ మరల కొత్త ప్రయత్నాలు చేయ్యబోడు అంటున్నారు.