Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్‌బాస్ అంటేనే వివాదాలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు హిందీలో 10 సీజన్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తాజాగా 11వ సీజన్ ప్రారంభం అయ్యింది. 11వ సీజన్‌కు కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో బిగ్‌బాస్ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు హిందీ బిగ్‌బాస్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను హిందీ బిగ్‌బాస్ దక్కించుకుంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రతి వారాంతంలో సల్మాన్ ఖాన్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా కూడా ఇంటి సభ్యులతో సల్మాన్ ఖాన్ మాట్లాడాడు. అయితే సల్మాన్ ఖాన్ కాస్త శృతిమించి మాట్లాడాడు. ఇంటి సభ్యులను తీవ్ర స్థాయిలో దూషిస్తూ సల్మాన్ ఖాన్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపర్చింది.
బిగ్‌బాస్ 11వ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా దావుద్ బందువు ఈ షోలో ఉన్నాడు, బహిష్కరించాలి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దావుద్ ఇబ్రహీం బందువు అయిన జుబైర్ ఖాన్ బిగ్‌బాస్ ఇంట్లో కాస్త అతి చేయడం ప్రారంభించాడు. ఇతరులను బెదిరించడంతో పాటు, అన్ని తాను అనుకున్నట్లుగా జరిగేలా చేసుకోవడం, ఇంకా ఆడవారితో చెడుగా ప్రవర్తించడం జరిగింది. ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. జుబైర్ ఖాన్‌కు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీవ్ర పదజాలంతో సల్మాన్ అతడిని దూషించాడు.
దేశం, ప్రాంతం, మతం పేరుతో జుబైర్ ప్రవర్తించిన తీరును సల్మాన్ కడిగి పారేశాడు. దాంతో ఆగ్రహించిన జుబైర్ ఖాన్ ఆత్మహత్య యత్నం చేసినట్లుగా హిందీ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంటి సభ్యులు మరియు బిగ్‌బాస్ నిర్వాహకులు అతడిని కాపాడి ఇంట్లోంచి బయటకు పంపించారు. అతడు సల్మాన్ ఖాన్‌పై పోలీసు కేసు పెట్టాడు. తనను తీవ్రంగా హింసించి, తన పరువు తీశాడు అంటూ సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సల్మాన్‌ను విచారిస్తామని హామీ ఇచ్చారట.