శైలజకు ఇలా కలిసి వస్తుందేంటో..!

keerthy-suresh-act-in-sharwanand-next-film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Keerthy Suresh Act In Sharwanand Next Film

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోతుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రను పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మడు మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాల్లో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న నేపథ్యంలో తెలుగులో ఈమెకు భారీ క్రేజ్‌ పెరుగుతూ ఉంది. తమిళంలో కూడా వరుసగా చిత్రాలు చేస్తున్న ఈమెకు తెలుగులో మరో సినిమాలో నటించే అవకాశం దక్కింది.

‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా నిర్మాతలు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్‌ దేవినేనిలు ప్రస్తుతం ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దాంతో కీర్తి సురేష్‌ చిన్న హీరో అయినా కూడా శర్వాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు అందాల ప్రదర్శణకు మాత్రం నో అంటే నో అంటుంది.

మరిన్ని వార్తలు:

జైలవకుశ కి జైజైలు కొడుతున్న సెలెబ్రిటీలు.

రావణుడొచ్చాడు.