న‌యన్ కు స్పెష‌ల్ విషెస్ చెప్పిన ద‌ర్శ‌కుడు…

vignesh Shivan Birthday wishes to Nayanathara in twitter Goes Viral

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

న‌య‌న‌తార పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌మిళ‌, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఎంతోమంది ప్ర‌ముఖులు ఆమెను శుభాకాంక్ష‌ల్లో ముంచెత్తారు. అయితే ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ న‌య‌న్ కు చెప్పిన బ‌ర్త్ డే విషెస్ నెట్ లో వైర‌ల్ గా మారాయి. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న విఘ్నేశ్, న‌య‌న్ లు త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్కనున్నార‌ని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ నేప‌థ్యంలో విఘ్నేశ్ ట్విట్ట‌ర్ లో న‌య‌న్ కు విషెస్ చెప్పిన విధానం చూస్తే ఈ వార్త‌లు నిజ‌మే అనిపిస్తుంది. తాను ఎంతో గౌర‌వించే మ‌హిళ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ మొద‌లుపెట్టిన విఘ్నేశ్, ప్రియురాలు ఎప్పుడూ ఇలాగే అందంగా, ధైర్యంగా ఉండాల‌ని ఆకాంక్షించాడు.

న‌య‌న‌తార అంటే ఏమిటో చూపిస్తూనే ఉండాల‌ని, నిన్ను చూస్తే ఎప్పుడూ గ‌ర్వంగానే ఉంటుంద‌ని, నా ప్రేమ‌, గౌర‌వం నీకే నా తంగ‌మ్మే అని ట్వీట్ ముగించాడు. అలాగే వాళ్లిద్ద‌రూ క‌లిసి న‌వ్వుతూ పోజిస్తున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన త‌రువాత‌… న‌య‌న్, విఘ్నేశ్ ప్రేమ నిజ‌మేన‌న్న అంచ‌నాకు వ‌చ్చారు త‌మిళ ప్రేక్ష‌కులు. ఇటీవ‌లే న‌య‌న‌తార న‌టించిన ఆర‌మ్ సినిమా త‌మిళ‌నాడులో ఘ‌న‌విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. క‌లెక్ట‌ర్ గా న‌య‌న్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు దక్కుతున్నాయి. త‌న వైఖ‌రికి భిన్నంగా న‌య‌న్ ఆర‌మ్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో సైతం పాల్గొంటున్నారు.

Vignesh shivan birthday tweet to Nayanathara