చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్..వాటికి సంపూర్ణ మద్దతు

Pawan Kalyan reacts to Visakha fishing harbor incident
Pawan Kalyan reacts to Visakha fishing harbor incident

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా విపక్షాలు ఖండిస్తున్నాయి . చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ ఓ వీడియో విడుదల చేశారు.. అసలు ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలం భిస్తుందని మండిపడ్డారు. గత యేడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల ఏ విధం గా వ్య వహరిం చారో అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారు..

నేడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని ప్రకటించారు. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదు అని పవన్‌ కల్యాణ్‌ హితవుపలికారు. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైసీపీ, ప్రభుత్వం , పోలీసులు ఊరుకోమని అంటున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా..? అధికార పార్టీకి సం బంధం ఏమిటి..? అని నిలదీశారు.

నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా..? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఒక నాయకుడు అరెస్టు అయితే.. అభిమానులు, కార్య కర్తలు రోడ్లపైకి రావడం సహజం.. మీ నాయకులు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు .. అయినా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.. కానీ, వారి నాయకులను అరెస్టు చేస్తే.. ఇంట్లో నుంచి బయటకు రానీయకూడదంటే ఎలా..? అంటూ మండిపడ్డారు పవన్‌.. లా అం డ్ ఆర్డర్ కంటే కూడా.. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధిం పు చర్య గానే భావిస్తున్నాం అన్నారు. చంద్రబాబు వీటి నుంచి బయటపడాలని జనసేన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ వెల్లడించారు.