కరోనా కేసులు భారత్ లో మొదట చాలా తక్కువ నమోదు అయ్యాయి. లాక్డౌన్ విధించడం.. ఆ తర్వాత ఇచ్చిన సడలింపులు అన్ని చేసినా గానీ.. భారత్లో కరోనా వైరస్ విజృంభణ తగ్గడం లేదు. ఇదే సమయంలో సీసీఎంబీ తీవ్రంగా హెచ్చరించింది. జూన్ నెల చివరి నాటికి భారత్లో కరోనా కేసుల సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది సీసీఎంబీ. వలస కార్మికులు సొంత ఊళ్లకు తిరిగి వెళ్తుండడంతో వైరస్ పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తోందని షాకింగ్ నిజాలు వెల్లడించింది.