Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో డబ్బు ప్రభావం మాట ఎత్తగానే చదువుకున్నోళ్ళు సైతం అబ్బా లెక్చర్ మొదలైంది అనుకుంటూ పక్కకి వెళ్లడమో లేక ఇది జరిగే పనేనా అంటూ నిరాశగా మాట్లాడడమో చూస్తుంటాం. సమాజం వైఖరి చూసాక కొద్దో గొప్పో మార్పు మీద నమ్మకం వున్నవాళ్లు కూడా డీలా పడతారు. అయితే అలా నిరాశ దరిచేరకుండా 123 స్వచ్ పాలిటిక్స్ పేరుతో ఓ బృందం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోంది. అందరికీ రాజకీయాల్లో నిజాయితీ ఎంత అవసరమో చెప్పడంతో పాటు ఓటు అమ్ముకోవడం వల్ల జరిగే నష్టాన్ని కూడా వివరిస్తున్నారు. వారికి కూడా కొన్ని చేదు అనుభవాలు తప్పలేదు. అయినా ఆ బృందం ముందుకు వెళుతూనే వుంది. మాచర్లలో ఆ బృందం సౌరమ్మ అనే ఓ వృద్ధురాలికి ఓటు అమ్ముకోవడం వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. అంతా విన్నాక ఆమె ఎంతో నిజాయితీగా 40 ఏళ్ల నుంచి తాను ఓటు అమ్ముకుంటున్నట్టు ఒప్పుకుంది. అయితే మీలాగా ముందుకొచ్చి దాని వల్ల జరిగే నష్టాన్ని ఎవరూ చెప్పలేదని ఆమె వాపోయింది. ఇకపై ఓటు అమ్ముకోబోనని ప్రమాణం చేసింది. ఆ దృశ్యాలు మీకోసం…
మరిన్ని వార్తలు