Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాకి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్యాహ్నం 11 :30 నుంచి 12 :30 మధ్య ఎన్టీఆర్ ఘాట్ లో ముహూర్తపు షాట్ తీయనున్నారు. దీంతో లక్ష్మీపార్వతి క్యాంపు లో అలజడి రేగుతోంది. పైగా ఆ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన తాజా పోస్టర్ ఇంకో వివాదానికి దారి తీసేలా వుంది. ఆ పోస్టర్ లో లక్ష్మీపార్వతి పాత్రని పోలిన ఓ మహిళ బెడ్ మీద ఉండగా ఆమె కాళ్ళ వైపు ఎన్టీఆర్ ఫోటో పెట్టి వుంది. తొలి రెండు పోస్టర్స్ లోనే లక్ష్మీపార్వతిని ఎలా చూపించబోతున్నారో అర్ధం అయినప్పటికీ తాజా పోస్టర్ తో ఆ ఘాటు ఇంకా పెరిగినట్టు అనిపించింది. ఇక ఈ పోస్టర్ , ముహూర్తం అయిపోయాక లక్ష్మీస్ వీరగ్రంధం మీద లక్ష్మీపార్వతి అమాంతం విరుచుకుపడడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే కొందరు సన్నిహితులు లక్ష్మీపార్వతికి ఈ గండం నుంచి తప్పించుకోడానికి ఓ సలహా ఇచ్చారట. లక్ష్మీపార్వతి దాన్ని ఫాలో అయితే “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ కి షాక్ తప్పదు. ఇంతకీ లక్ష్మీపార్వతి సన్నిహితులు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా ?
ఒకప్పుడు వర్మని దారితప్పిన మేధావిగా అభివర్ణించిన లక్ష్మీపార్వతి ఆయన శిష్యుడు J.D. చక్రవర్తి వచ్చి అడగ్గానే “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఒక్కటే కారణం వుంది. చంద్రబాబు , ఎన్టీఆర్ ఫామిలీ, టీడీపీ ని దెబ్బ తీయడమే ఆ సినిమా ఉద్దేశం. తద్వారా వైసీపీ కి లబ్ది చేకూర్చడం. అయితే లక్ష్మీపార్వతి ఈ ఊహల్లో వుండి ఓ విషయం మర్చిపోయారు. తమ ప్లాన్ కి ప్రత్యర్ధులు కౌంటర్ ప్లాన్ వేస్తారని ఆమె గుర్తించలేకపోయారు. ” లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమా ప్రకటన వచ్చాక గానీ ఆమెకి ఆ విషయం అర్ధం కాలేదు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి సన్నిహితులు ఇచ్చిన విలువైన సలహా ఏమిటంటే ఒకవేళ “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా ముందుకు వెళ్లకపోతే “లక్ష్మీస్ వీరగ్రంధం “ ఆపమని అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పారట. ఈ విషయం మీద వర్మని ఒప్పిస్తే లక్ష్మీస్ వీరగ్రంధం గండం నుంచి బయటపడొచ్చని అనుకుంటున్నారట. అంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి తల ఊపి ఇప్పుడు ఆ సినిమా ఆపమని వర్మని అడగడానికి లక్ష్మీపార్వతి సందేహపడుతున్నారు. అయితే వీరగ్రంధం బయటకిరాకుండా ఉండాలంటే ఆ పని చేయక తప్పదు. మొత్తానికి గుండె దిటవు చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపాలని వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ని అడగడానికి లక్ష్మీపార్వతి సిద్ధం అవుతున్నారట.