Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేషనల్ మీడియా ఇప్పుడు చంద్రబాబు భజన చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ మీద మొహం మొత్తిందో లేక, ప్రత్యామ్నాయ నాయకుడి కోసం వెయిట్ చేస్తుందో తెలియదు కానీ, సడెన్‌గా జాతీయ మీడియా ఫోకస్ ఒక్కసారిగా చంద్రబాబుపై పడింది. గత రెండు రోజులుగా బీజేపీతో పొత్తుపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని…. బులెటిన్ల మీద బులెటిన్లు నడుపుతోంది.
బ్రేకింగ్ న్యూస్‌ల మీద బ్రేకింగ్‌లు వేసి రన్ చేస్తోంది.
చంద్రబాబుపై నేషనల్ లెవల్లో చర్చ నడవడానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. జాతీయ స్థాయిలో మోదీ ప్రభ తగ్గుతోంది. గుజరాత్ ఎన్నికలతోనే అది బయటపడింది.
తాజాగా రాజస్థాన్‌లో జరిగిన రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికలలో కమలం పార్టీ భారీ తేడాతో ఓడిపోయింది. రెండు ఎంపీ స్థానాలలో ఏకంగా లక్షన్నర ఓట్ల తేడా ఉంది అంటేనే అర్ధం చేసుకోవచ్చు….
రాజస్థాన్‌లో బీజేపీ సర్కార్‌పై ముఖ్యంగా మోదీ అవలంబిస్తున్న విధానాలపై ఎలా మొహం మొత్తి ఉన్నారో…. ఈ మూడు స్థానాలు కూడా బీజేపీ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం.
మోదీ గ్రాఫ్ పడిపోవడం ఒక కారణమైతే… ఇటు, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇమేజ్ రెయిజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా…. అది స్వల్పంగానే ఉండడం విశేషం. ఇప్పటికే పలు సర్వేలు… 2019 నాటికి బీజేపీ మరోసారి పూర్తి మెజారిటీ దక్కించుకునే పరిస్థితులు లేవని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే అవతరిస్తుందని అంచనాలు కడుతున్నారు. కాంగ్రెస్ 100 స్థానాలు కూడా దక్కించుకునే ఊపు కనిపించడం లేదు. దీంతో, నేషనల్ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం మరోసారి కీలక భూమిక పోషించనున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి.
అప్పుడు వారికి ఆల్టర్నేటివ్గా అన్ని పార్టీలను కాంగ్రెస్ అండతో నిలిపిఉంచే సత్తా చంద్రబాబుకే ఉందని అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ములాయం సింగ్ యాదవ్‌ని ఏకంగా పార్టీ నుంచే తరిమివేశారు ఆయన తనయుడు ఎస్పీ అధినేత. పీఎం అభ్యర్ధిగా గత ఎన్నికలలో ఫోకస్లో ఉన్న జేడీయూ అభ్యర్ధి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్… బీజేపీ మద్దతుతో సీఎంగా ఉన్నారు. దీంతో, ఆయన బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక, ప్రాంతీయ స్థాయిలో అందరి ఆమోదం ఉన్న మరో నేత, వెస్ట్ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పీఎం అభ్యర్ధి అంటే వామపక్షాలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో అందరి ఆమోదం ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబే కనిపిస్తున్నారు. ఆయన పీఎం కేండిడేట్ అంటే ఇటు, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌కి, తమిళనాడు నేతలకి కూడా పట్టింపులు ఉండవు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దీనికి అంగీకరిస్తారని అంటున్నారు. ఎందుకంటే, చంద్రబాబు ఆయన గురువు కావడమే దీనికి కారణం అంటున్నారు.
ఇలా, ఈక్వేషన్స్ అన్నీ సెట్ అవడంతో చంద్రబాబుకి జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతోందట. గతంలో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా, ఎన్డీఏ లీడర్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు ఇది అంత పెద్ద బాధ్యత కాదు. దీంతో, మోదీని ఢీకొనే సరైన నేతగా బాబుకు జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది.
పాలిటిక్స్‌లో ఏదయినా సాధ్యమే. ఎందుకంటే, అక్కడ ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు.. పదకొండు కావొచ్చు.. ఒకటీ కావొచ్చు.. జీరో కూడా అయ్యే చాన్స్ ఉంది. మరి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఈ తాజా డెవలప్‌మెంట్స్‌ని బీజేపీ ఎలా మలుచుకుంటుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.