24 కిస్సెస్ అంటూ వచ్చిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులని ఎంతగా ఆకర్షించాయంటే ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడా అని గూగుల్ సెర్చ్ లో వెతికేంతలా. పైగా ఈ సినిమాలో కుమారి 21ఎఫ్ తో యువకుల హృదయాలను బోల్డ్ గా కొల్లగొట్టిన హెబ్బా పటేల్ హీరోయిన్ అవ్వడం ఈ సినిమాలో తగినంత బోల్డ్ నెస్ ఉంటుందనే ప్రేక్షకుల ఊహలకు నిచ్చెన వేసింది. ఈ సినిమాలో హీరోగా అదిత్ అరుణ్ (కథ, గరుడవేగా ఫేమ్) నటిస్తుండగా, మిణుగురులు అనే సందేశాత్మక చిత్రంతో జాతీయస్థాయి పురస్కారం సాధించిన అయోధ్యకుమార్ తన రూట్ మార్చి, కుర్రకారు ను ఉర్రుతలూగించడానికి “నీకో సగం…నాకో సగం.. ఈ ఉత్సవం” అంటూ మాంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నాడు. అటు ట్రైలర్ ని చూసినా, ఆ కిస్సుల్లో పొయెటిక్నెస్ కనిపిస్తుందే కానీ వెకిలితనం కి ఏమాత్రం చోటివ్వలేదు దర్శకుడు.
తాజాగా మేకింగ్ వీడియో అంటూ మరో వీడియో ని రిలీజ్ చేశారు ఈ చిత్ర టీం. అందులో ఎలా హీరో హీరోయిన్ ల మధ్య అధరచుంబనాలు తెరకెక్కించారో విపులంగా, అరటిపండు ఒలిచినట్లుగా చూపించారు. ఈ మేకింగ్ వీడియో చూశాక ఆ గాఢమైన ముద్దులు నిజమేనని, హీరోహీరోయిన్ కలిసి అధర తాంబూలాలు ఒకరికి ఒకరు పంచుకున్నారని ఇట్టే తెలిసిపోతుంది. ఈ వీడియో లోని ప్రతి ముద్దు కవ్విస్తుండగా, ఆ చిత్రీకరించిన విధానం సినిమాపైన అంచనాలని మరింతగా పెంచేస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, నరేష్ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో ఇప్పటికే ట్రైలర్ లో కనపడి అలరించారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్లకు తీపి కబురు ఏమిటంటే ఈ నెల 23 న ఈ 24 కిస్సెస్ మీ దగ్గరలోని థియేటర్లలో విడుదల అవ్వబోతుంది.