‘స్పైడర్‌’ అసలు కలెక్షన్స్‌.. ఎంత నష్టమో తెలుసా?

40-crores-loss-for-mahesh-babu-spyder-distributors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్‌’ చిత్రం మొదటి వారం రోజులు పూర్తి చేసుకుంది. మొదటి వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 31.9 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌ మరియు తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం మొత్తంగా కలిపి 45 కోట్లు వసూళ్లు సాధించిందని ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను 90 కోట్లకు అమ్మేయడం జరిగింది. మొదటి వారం రోజుల్లో 45 కోట్లు వసూళ్లు సాధించింది. ఇంకా ఈ సినిమా 10 కోట్లకు మించి వసూళ్లు సాధించడం దాదాపు అసాధ్యం అని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

90 కోట్లకు డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ అమ్ముడు పోగా మొత్తంగా చూస్తే 50 కోట్లకు అటు ఇటుగా మాత్రమే కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకా దాదాపు 40 కోట్లు నష్టంలో డిస్ట్రిబ్యూటర్లు ఉండే అవకాశం ఉంది. దాదాపు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా మూడు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. కాని అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్‌ లాస్‌ను మిగిల్చుకున్నాడు తమిళనాడులో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్‌లకు మాత్రం లాభాలు రాలేదని తమిళ ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

నిర్మాతలు ఈ సినిమాను దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ద్వారా 90 కోట్లు ఇక ఇతర రైట్స్‌ ద్వారా మరో 50 కోట్ల వరకు దక్కించుకున్నారు. మొత్తంగా 140 కోట్ల వరకు నిర్మాతలు దక్కించుకున్నారు. 120 కోట్లు పెట్టుబడి పోగా 20 కోట్ల లాభాల్లో స్పైడర్‌ నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు తీసినప్పుడు నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ రిస్క్‌. స్పైడర్‌ విషయంలో కూడా అదే జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 40 కోట్ల మేరకు నష్టపోయారు. ఇక ఇతర రైట్స్‌ తీసుకున్న వారు కూడా నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు