Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘పెళ్లి చూపులు’ చిత్రంతో విజయ్ దేవరకొండ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా తర్వాత భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండతో పలువురు దర్శకులు పని చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి నటన అద్బుతం అంటూ సినీ వర్గాల వారు మరియు విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. రాజమౌళి, వర్మ వంటి వారు కూడా విజయ్ అద్బుతంగా నటించాడని కితాబిస్తున్నారు. ఈ సమయంలో ఈ యువ హీరోతో కలిసి వెంకటేష్ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే వెంకటేష్, విజయ్ దేవరకొండల కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ పట్టాలెక్కబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరిగాయి. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాణంలో భాస్కర్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. వెంకటేష్, విజయ్ దేవరకొండలు అన్న దమ్ముళ్లుగా కనిపించనున్నారని, విజయ్ పాత్రకు మంచి ప్రేమ కథ ఉంటుందని, వెంకటేష్ హుందా అయిన పాత్రలో కనిపిస్తాడని సమాచారం అందుతుంది. సురేష్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటాడని సమాచారం. మొత్తానికి వెంకీ, అర్జున్ రెడ్డిల కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆ అంచనాలు అందుకునేలా దర్శకుడు భాస్కర్ సినిమాను తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: