మెగా డాటర్ నిహారికకు అబ్బాయిని వెతికే పనిలో పడ్డారట నాగబాబు. అదేంటి అప్పుడే పెళ్లి అనుకుంటున్నారా ? అయితే తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో కూతురు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన ఆయన మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నాం త్వరలోనే నిహారికకు పెళ్లి చేస్తానని అన్నారు. తన ఇష్టం మేరకు మొదట సినిమాల్లో నటిస్తా అంటే ఒప్పుకున్నానని కానీ ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదనీ కానీ అయితే వెబ్ సిరీస్‌తో సక్సెస్ అయ్యిందని తాజాగా సూర్యకాంతం చిత్రంలో నటిస్తుందని చెప్పుకొచ్చారు.
ఆమె సినిమాల్లోకి వచ్చే ముందు మరో రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తా అని ముందే చెప్పానని ఇప్పుడు ఆ సమయం రానేవచ్చిందని అందుకే మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే తనకు కాపు కులం ఇష్టం అంటూనే తనకు కుల పట్టింపులు పెద్దగా ఉండవని అబ్బాయి మంచోడయి ఉండి తన కాళ్ల మీద తాను నిలబడి మంచి వ్యక్తిత్వం ఉన్న వాడైతే చాలనీ చెబుతున్నాడు. మా కులంలో అలాంటి సంబంధం వస్తే మంచిదేనని లేదంటే వేరే కులం వ్యక్తి అయినా అభ్యతరం లేదనీ ఆయన అంటున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనే ఆంక్షలేమీ లేవనీ కుటుంబ నేపథ్యం బాగుండి మంచి గుణం, పద్ధతైన కుర్రాడైతే చాలనీ చెప్పుకొచ్చాడు. అలాంటి సంబంధం వస్తే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నామంటూ నిహారిక పెళ్లి ప్రకటన చేశారు నాగబాబు.