రజనీ చేరేది కమలం గూటికేనా..?

actor-rajinikanth-wont-join-bjp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీహార్లో విజయవంతంగా మాహకూటమిని విచ్ఛిన్నం చేసిన బీజేపీ.. నెక్స్ట్ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఇక్కడ కూడా అధికార కూటమిలో భాగస్వామి కావాలని ప్రయత్నిస్తోంది. కానీ తమిళనాడు అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు లేదు. కాబట్టి ఎలాగైనా అన్నాడీఎంకేను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది కాషాయ పార్టీ. ఇందులో భాగంగానే రజనీకాంత్ ను దువ్వుతోందని చెబుతున్నారు విశ్లేషకులు.

ఏదో సాకుతో రజనీని కలుస్తున్న కాషాయ నేతలు.. తమకు సూపర్ స్టార్ టచ్ లో ఉన్నారని చెప్పుకోవడానికి చాలా పాకులాడుతున్నారు. తద్వారా ఇటు అన్నాడీఎంకే, అటు డీఎంకే రెండు పార్టీలపై ఒత్తిడి పెంచాలన్నది అసలు వ్యూహంగా ఉంది. మరి రజనీ బీజేపీ బుట్టలో పడతారా.. లేదంటే సరికొత్త రాజకీయ వ్యూహంతో ముందుకొస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఇప్పటికే అన్నాడీఎంకే మోడీ మాయలో పడిపోయింది. మరో పదేళ్లు మోడీ ఉంటారని, అలాంటప్పుడు ఆయనతో గొడవెందుకని ఇప్పటికే సీనియర్ నేతలు సీఎం పళనిస్వామిపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన కోరినట్లు చేసేస్తే మనకు ఢోకా ఉండదని, రేపు ఎన్నికల్లో కూడా మోడీ ఛరిష్మా పనికొస్తుందని చెబుతున్నారట. కానీ మరో వర్గం మాత్రం బీజేపీకి తమిళనాడులో అంత సీన్ లేదని, అనవసరంగా కంగారొద్దని చెబుతోందట. దీంతో పళనిస్వామి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

మరిన్ని వార్తలు: