Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి తరలించాలని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా పరిశ్రమ అమరావతికి వస్తేనే అభివృద్ది స్పీడ్‌గా జరుగుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయం. అందుకే సినీ ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వడం వెనుక కారణం కూడా అదే అని కొందరు అంటున్నారు. ఇక అమరావతిలో స్టూడియోలో నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి అతి తక్కువ రేట్లకు భూములను లీజుకు ఇవ్వడం లేదా, అమ్మడం చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
హైదరాబాద్ మరియు వైజాగ్‌లో ఇప్పటికే రామానాయుడు స్టూడియోలో ఉన్నాయి. వైజాగ్ రామానాయుడు స్టూడియోకు పెద్దగా ఆధరణ దక్కడం లేదు. అందుకే అమరావతిలో స్టూడియో నిర్మాణంకు సురేష్‌బాబు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రామానాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ రాజధానిలో స్టూడియో నిర్మించాలని కోరుకున్నారట. ఇప్పుడు సురేష్‌బాబు ఆ కారణంగానే అమరావతిలో స్టూడియోను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవలే చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి స్టూడియో నిర్మాణంకు అనుమతితో పాటు అనువైన భూమిని ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అమరావతి చుట్టు పక్కల ఎక్కడ అయినా కూడా 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2020 వరకు రామానాయుడు స్టూడియోను అమరావతిలో మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.