టాలీవుడ్లో గత కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న విషయం కాస్టింగ్ కౌచ్. హీరోయిన్స్ ఎక్కువ శాతం మంది తమ అందాన్ని నిర్మాతలకు మరియు దర్శకులకు ఎరగా వేసి అవకాశాలను దక్కించుకుంటున్నారు అని, సినిమాల్లో నటించాలని వస్తున్న అమాయకపు అమ్మాయిలను శారీరకంగా దోచుకుంటున్నారు అంటూ గత కొంత కాలంగా హీరోయిన్స్ కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద యుద్దమే చేస్తున్న విషయం తెల్సిందే. కాస్టింగ్ కౌచ్‌పై కొందరు వ్యతిరేకంగా ఉంటే మరి కొందరు మాత్రం సానుకూలంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కొందరు నటీమణులు అసలు కాస్టింగ్ కౌచ్ అనేది లేదంటుంటే మరి కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ ఉన్నా తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజాగా సీనియర్ నటి పవిత్ర లోకేష్ మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రపంచంలో సినిమా పరిశ్రమ అనేది చాలా చిన్నది. ఆ చిన్న పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే విషయం మరింత చిన్న విషయం అంటూ చెప్పుకొచ్చింది. దేశ వ్యాప్తంగా రోజు ఎంతో మంది చిన్న పిల్లలను రేప్‌లు చేస్తున్నట్లుగా మీడియాలో చూస్తున్నాం. ఆ విషయంతో పోల్చితే ఇదో పెద్ద సమస్య కానే కాదు. ఇద్దరు పరిణితి చెందిన వారి మద్య సెక్స్ అనేది జరుగుతున్నప్పుడు దానికి కాస్టింగ్ కౌచ్ అంటూ పేరు పెట్టడం ఏంటని ఈమె అంటున్నారు. తమను అర్పించుకోవడం ఇష్టం లేనప్పుడు సినిమా పరిశ్రమ కాకుండా మరేదైనా పరిశ్రమను చూసుకోవాలని, లేదంటే ఎవరికి తలొగ్గకుండా సినిమా పరిశ్రమలో కష్టపడాలంటూ చెప్పుకొచ్చింది. పవిత్ర వ్యాఖ్యలు కాస్త కఠినంగా ఉన్నా కూడా వాస్తవమే కదా అంటూ కొందరు మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమ పరువు తీయడం కాకుంటే మొదట ఒప్పుకుని, ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ అంటూ గగ్గోలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.