వడ్డించే వాడు మనవాడయితే బంతిలో ఏ మూల కూర్చున్న సింహ భాగం దక్కుతుంది. ఆ మధ్య హిండెన్ బర్గ్ అనే సంస్థ పలు కీలక ఫైల్స్ బయట పెట్టడంతో ఆదానీ కంపెనీ ఉక్కపోతకు గురయింది. దాని షేర్ వాల్యూ ఆమాంతం పడిపోయింది. అది ఏకంగా దేశ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. కొద్ది నెలల వరకూ అదానీ గ్రూప్ కోలుకోలేదని వార్తలు వచ్చాయి. జాతీయ స్థాయి మీడియాలో మరోసారి బ్రేకింగ్ న్యూస్ అయింది.
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ అతలాకుతలమైంది. అయితే అటువంటి కంపెనీ తొలిసారిగా టేక్ ఓవర్‌కు సిద్ధమైంది. దీని కోసం సంఘీ ఇండస్ట్రీస్ ఎంటర్‌ప్రైజ్ విలువను రూ. 5000 కోట్లుగా లెక్కించినట్టు సమాచారం. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామం తర్వాత సంఘీ సిమెంట్ కొనుగోలు నుంచి తాము తప్పుకుంటున్నట్టు శ్రీ సిమెంట్ జూలైలో ప్రకటించింది.
ముంబై ఎయిర్ పోర్ట్‌లో జీవీకేకు 50.5 శాతం, దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్ వెస్ట్ హుడ్ అనే కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. అయితే, అదానీ గ్రూప్ ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే ఆరోపణలన్నాయి. 13.5 శాతం బిడ్ వెస్ట్ హుడ్ వాటాను చేజిక్కించుకున్నది. ఈ నేపథ్యంలో జీవీకే గ్రూప్ కోర్టులో కేసు వేసింది. ఈక్రమంలో జరిగిన పరిణామం ఒక్కసారి అనూహ్యంగా మారింది. పైగా ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదని కోర్టుకు తెలిపిన సీబీఐ. చైన్నైకి చెందిన మార్గ్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ కరైకల్ పోర్ట్‌లో 45 శాతం వాటా ఉండేది. అనంతరం ఆ పోర్ట్ అదానీ గ్రూప్ వశమైంది.