ఆదిత్యా చోప్రా స‌ల‌హా మేర‌కే ఇట‌లీని ఎంచుకున్న విరుష్క‌

aditya chopra advice to Anushka Sharma and kohli for wedding

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
విరుష్క పెళ్లి జ‌రిగి 24 గంట‌లు దాటుతున్నా… ఇంకా వారి వివాహ విశేషాల వార్త‌ల‌కు తెర‌ప‌డ‌లేదు. త‌మ ప్రేమ‌ను నిర్భ‌యంగా బ‌య‌ట‌కు వెల్ల‌డించిన ఈ జంట పెళ్లి విష‌యాన్ని మాత్రం ఇంత ర‌హ‌స్యంగా ఎందుకుంచార‌న్న‌ది… మీడియాకు, వారి అభిమానుల‌కు అంతుచిక్క‌ని విష‌యంగానే మిగిలిపోయింది. పైగా భార‌త్ తో పాటు ప్ర‌పంచంలో ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు ఉండ‌గా… విరుష్క ఇట‌లీనే ఎంచుకోవ‌డానికి కార‌ణ‌మేంటో ఎవ‌రికీ అర్ధం కాలేదు. అయితే తాజాగా వినిపిస్తోన్న సంగ‌తి ఏంటంటే బాలీవుడ్ ద‌ర్శ‌క, నిర్మాత‌, న‌టి రాణీ ముఖ‌ర్జీ భ‌ర్త ఆదిత్య చోప్రా… విరుష్క వివాహం ఇట‌లీలో జ‌ర‌గ‌డానికి కార‌ణమ‌ట‌.

 Anushka Sharma And Kohli got Wedding in italy

మీడియా, అభిమానుల హ‌డావిడి లేకుండా త‌మ పెళ్లి వేడుక‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించుకోవాల‌ని కోహ్లీ, అనుష్క భావించారు. పెళ్లి విష‌యం అనుష్క ఆదిత్య చోప్రాకు చెప్ప‌గానే… ఆయ‌న ఇట‌లీలో చేసుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఇండియాలో ఎక్క‌డ పెళ్లిచేసుకున్నా… మీడియాకు తెలిసిపోయి హ‌డావిడి సృష్టిస్తార‌ని, ప్ర‌శాంతంగా పెళ్లి జ‌ర‌గాలంటే ఇట‌లీ బెట‌ర‌ని సూచించార‌ట‌. ఆయ‌న రాణీముఖ‌ర్జీని 2014లో ఇట‌లీలోనే వివాహ‌మాడారు. అలా ఆదిత్య చోప్రా స‌ల‌హామేర‌కు విరాట్ ను పెళ్లాడేందుకు ఇట‌లీ విమాన‌మెక్కింది అనుష్క‌. ఆదిత్య చోప్రాను అనుష్క శ‌ర్మ త‌న మెంట‌ర్ గా భావిస్తుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌బ్ నే బ‌నాదీ జోడీ చిత్రంతోనే అనుష్క బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది. త‌ర్వాత య‌శ్ రాజ్ ఫిలింస్ లోనే వ‌రుస‌గా మూడు సినిమాలు చేసి అగ్ర‌హీరోయిన్ గా ఎదిగింది.

Kohli-and-anushka-sharma-we

అటు విరాట్, అనుష్క వెడ్డింగ్ రింగ్ పైనా… ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అనుష్క‌కు చ‌క్క‌గా స‌రిపోయే వెడ్డింగ్ రింగ్ కోసం విరాట్ మూడు నెల‌లు అన్వేషించాడ‌ని తెలుస్తోంది. చివ‌ర‌కు ఆస్ట్రియాకు చెందిన ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ తో అనుష్క కోసం అరుదైన డైమండ్ రింగ్ ను చేయించాడ‌ని కోహ్లీ స‌న్నిహితులు తెలిపారు. ఈ రింగ్ అత్యంత అద్భుతంగా ఉండ‌డంతో పాటు భిన్న కోణాల్లో చూసిన ప్ర‌తీసారి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటుంద‌ని, దీని ఖ‌రీదు కోటి రూపాయ‌ల వ‌రకు ఉంటుంద‌ని చెబుతున్నారు.