Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష దూకుడుని అడ్డుకోవడంలో సక్సెస్ అవుతున్నారు గానీ సొంత పార్టీ నేతల విషయంలో విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రకాశం జిల్లా అద్దంకి రాజకీయాలు. ఇటీవలే అక్కడ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వర్గాల మధ్య ఎంత ఘర్షణ జరిగిందో రాష్ట్రమంతా చూసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు వార్నింగ్ ఇస్తే గానీ మంత్రులు ఒంగోలు లో పార్టీ సభ నిర్వహించలేకపోయారు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుంది అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది.
తాజాగా నేడు మరోసారి అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అద్దంకిలో ఎమ్మెల్యే కి ఇబ్బంది కలిగించొద్దని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా బలరాం వర్గం పటించుకోవడం లేదు. అద్దంకిలో సీసీ రోడ్ శంఖుస్థాపన సందర్భంగా టీడీపీ లోని రెండు వర్గాల వారు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. నిజానికి ఈ శంకుస్థాపన చేయాల్సింది ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ . అయితే అంతకన్నా ముందే కరణం వర్గీయులు అక్కడికి వచ్చి శంఖుస్థాపన సన్నాహాలు చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలు అదుపు తప్పకుండా కట్టడి చేయాల్సి వచ్చింది.
బలరాంతో ఒకప్పటి స్నేహాన్ని గుర్తుంచుకుని సీఎం చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అటు గొట్టిపాటిని పార్టీలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ బలరాం వ్యవహారశైలితో ఆగ్రహంగా వున్నారు. అయితే పార్టీ లో మొదటి నుంచి ఉన్నారన్న గౌరవంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నా మౌనంగా వుంటున్నారు. అయినప్పటికీ బలరాం వర్గం దూకుడుతో చంద్రబాబు సహనానికి నిత్యం పరీక్ష పెడుతూనే వుంది.
మరిన్ని వార్తలు