Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అందానికి మారు పేరు ఐశ్వర్యారాయ్… ఆమె అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. దశాబ్దాలుగా అభిమానులు, మీడియా ఆమె అందాన్ని పొగుడుతూనే ఉంది. అయితే ఎంతటి అందగత్తెలకయినా వయసు అనేది ఒకటుంటుంది. వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతూ వస్తుంది. అయితే అందాల ఐశ్వర్యారాయ్ మాత్రం దీనికి భిన్నం. వయసు పెరిగే కొద్దీ ఆమె అందమూ పెరుగుతూ వస్తోంది. సాధారణంగా మహిళల అందం 30 ఏళ్లవచ్చే సరికి ముగిసిపోతుంది. 30-35 ఏళ్లు దాటిన మహిళను మధ్య వయసు ఆడవాళ్లగా పరిగణిస్తారు. వారిని అందగత్తెలుగా గుర్తించరు. కానీ ఐశ్వర్యారాయ్ ఇందుకు మినహాయింపు.
ఇప్పుడు ఆమె వయసు 44 ఏళ్లు. అయినా ఆమె అందం చెక్కుచెదరలేదు. 24 ఏళ్ల క్రితం 1994లో మిస్ ఇండియా కిరీటం అందుకున్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పటికీ అలాగేఉంది. అందుకే వయసు 40లు దాటినా ఆమె ఫొటోషూట్ కోసం అంతర్జాతీయ మ్యాగ్ జైన్ లు పోటీపడుతుంటాయి. తాజాగా ఐశ్వర్య వోగ్ మ్యాగజైన్ కు ఫొటోషూట్ ఇచ్చింది. ప్రముఖ అమెరికన్ గాయకుడు విలియం ప్యారెల్ తో కలిసి ఐశ్వర్య ఈ ఫొటో షూట్ లో పాల్గొంది. వైట్, బ్లూ, రెడ్ కలర్ డ్రెస్సుల్లో ఐశ్వర్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూస్తుంటే ఏ.ఆర్.రెహ్మాన్ ఆమెను 50 కేజీల తాజ్ మహల్ తో పోల్చడం సరైనదే అనిపిస్తుంది.