Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐశ్వర్యారాయ్ మరో ఘనత సాధించారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మొట్టమొదటి మహిళలకు ఇచ్చే ఫస్ట్ లేడీ అవార్డ్ అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న ఐశ్వర్యారాయ్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ అవార్డు అందజేశారు. ప్రముఖ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన ఏకైక భారతీయ నటి ఐశ్వర్యారాయ్. 2002 నుంచి ఏటా ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ వేడుకకు హాజరవుతున్నారు. ఇందుకు గానూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఐశ్వర్యారాయన్ ను సత్కరించారు. ఐశ్వర్యతో పాటు తొలి మహిళా రిక్షా డ్రైవర్ షీలా దవారే, అతి చిన్న వయసులో పైలట్ అయిన ఆయేషా, కశ్మీర్ కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అదికారిణి రువేదా సలామ్ తో కలిపి 112 మంది మహిళలు ఈ అవార్డ్ దక్కించుకున్నారు.