పరువు నిలుపుకున్న అక్కినేని ప్రిన్స్‌

Akhil Hello Movie Reached The Million-Dollar Mark
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా నటించిన మొదటి చిత్రం దారుణమైన పరాజయం పాలైంది. ఆ సినిమా నుండి తేరుకునేందుకు అఖిల్‌కు కాస్త సమయం పట్టింది. చాలా గ్యాప్‌ తీసుకున్న తర్వాత అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’ను విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేసిన విషయం తెల్సిందే. క్రిస్మస్‌ కానుకగా గత నెలలో విడుదలైన ‘హలో’ చిత్రం టాక్‌ పరంగా పర్వాలేదు అనిపించుకున్నా కలెక్షన్స్‌ పరంగా చాలా నిరుత్సాహ పడేలా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఎంసీఏ’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ చిత్రానికి పోటీగా విడుదలైన హలో మాత్రం చేతులెత్తేసింది. టాక్‌ పాజిటివ్‌గా వచ్చిన కలెక్షన్స్‌ నెగటివ్‌గా వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 15 కోట్లు ఈ చిత్రం రాబట్టేందుకు నానా కష్టాలు పడటం జరిగింది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఎంసీఏ చిత్రానికి గట్టి పోటీ ఇచ్చింది. అమెరికాలో ఈ చిత్రం ఏకంగా మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన హలో చిత్రంను ఓవర్సీస్‌ అభిమానులు ఆధరించారు. మొదటి 15 రోజుల్లో హలో చిత్రం మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసింది. కనీసం ఓవర్సీస్‌లో అయినా మంచి కలెక్షన్స్‌ రావడం వల్ల అక్కినేని వారి ప్రిన్స్‌ పరువు నిలిచింది. ప్రస్తుతం అఖిల్‌ మూడవ సినిమా చర్చల దశలో ఉంది. ఈనెల 10 తర్వాత అంటే సంక్రాంతి సందర్బంగా తన మూడవ సినిమాను ప్రకటిస్తాను అంటూ అఖిల్‌ ఇటీవలే చెప్పుకొచ్చాడు. ఇకపై గ్యాప్‌ లేకుండా వరుసగా చిత్రాలు చేస్తాను అంటూ అఖిల్‌ చెప్పుకొచ్చాడు. ఓవర్సీస్‌లో అఖిల్‌కు మంచి మార్కెట్‌ ఉందని హలో కలెక్షన్స్‌తో తేలిపోయింది.