Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు టాలీవుడ్లో హీరోలు సంవత్సరంలో పది అంతకు మించి చేశారు. కృష్ణ, చిరంజీవి వంటి వారు నెలకో సినిమాను విడుదల చేసిన సందర్బాలున్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక చిత్రం చేసేందుకు సంవత్సరాలు పడుతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా సంవత్సరంలో ఒక్కటి మాత్రమే వస్తుంది. ఒక్కో సారి అది కూడా రావడం లేదు. ఈ సంవత్సరంలో రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే ప్రతి ఒక్క హీరో కూడా సంవత్సరంలో రెండు లేదా మూడు చిత్రాలు చేసి ఫ్యాన్స్‌ను సంతోష పెడతాం అంటున్నారు. ఆ మద్య మహేష్‌బాబు మరియు చరణ్ ఇలా అంతా కూడా సంవత్సరంలో రెండు లేదా మూడు సినిమాలు చేస్తామని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు. కాని అది నిలుపుకోలేక పోయారు.
తాజాగా అక్కినేని ప్రిన్స్ అఖిల్ కూడా సంవత్సరంలో రెండు సినిమాలు చేస్తాను అంటూ ఫ్యాన్స్‌కు వాగ్దానం చేస్తున్నాడు. మొదటి సినిమా ‘అఖిల్’ తీవ్రంగా నిరాశ పర్చడంతో దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్‌ను తీసుకున్నాడు. తాజాగా ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘హలో’ సినిమాకు మిశ్రమ స్పందస వస్తుంది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన తర్వాత సినిమాను వచ్చే నెల 10 తర్వాత ప్రకటిస్తాను అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.
ఇకపై సంవత్సరంలో రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తాను అంటూ పేర్కొన్నాడు. అయితే స్టార్ హీరోల సినిమాలు సంవత్సరంలో రెండు విడుదల అవ్వడం అనేది చాలా కష్టం అని, అఖిల్ చెప్పిన మాట కూడా సాధ్యం అవ్వడం కష్టమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఒక వేళ అఖిల్ అన్నట్లుగా రెండు సినిమాలను సంవత్సరంలో విడుదల చేస్తే అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.