అఖిల్‌ కాన్ఫిడెన్సా? ఓవర్‌ కాన్ఫిడెన్సా?

Akhil Speech in Hello Movie Audio Launch at Vizag

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి చిత్రం దారుణంగా ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ఎన్నో కథలు విని చివరకు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేశాడు. ‘హలో’ టైటిల్‌తో తెరకెక్కిన అఖిల్‌ రెండవ చిత్రం ఈనెల 22న క్రిస్మస్‌ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియోను నిన్న వైజాగ్‌లో వైభవంగా విడుదల చేశారు. ఆడియో వేడుకలో అఖిల్‌ పాట మరియు ఆటతో లైవ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చి అందరిని ఆకట్టుకుని, అలరించాడు. వైజాగ్‌ ప్రేక్షకుల సాక్షిగా తాను చేసిన ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

అఖిల్‌ ఇంకా మాట్లాడుతూ ‘హలో’తో హిట్‌ కొట్టబోతున్నాను, హలోను ఆధరించేందుకు రెడీగా ఉండండి, హలో నా కెరీర్‌లో నిలిచి పోయే చిత్రం అవుతుందని ధీమాగా చెప్పుకొచ్చాడు. అఖిల్‌ కాస్త భావోద్వేగంకు లోనై చెప్పడంతో అంతా కూడా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ వర్గాల వారు అఖిల్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లుగా గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో అఖిల్‌ కాస్త అతిగా మాట్లాడటంతో సినిమా ఫలితం గురించి అప్పుడే నెగిటివ్‌గా చర్చించుకుంటున్నారు. కాని కొందరు మాత్రం అఖిల్‌ గట్టిగా చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్‌ ఉండి ఉంటుందని, తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.