Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాజాగా నంది అవార్డులను జ్యూరీ ప్రకటించిన విషయం తెల్సిందే. నంది అవార్డుల ఎంపిక విషయంలో పారదర్శకత్వం పాటించలేదని, మొత్తం అవకతవకలు జరిగాయి అంటూ, రాజకీయం నంది అవార్డుల ఎంపికలో జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదం కావడం కొందరిని కలిచి వేస్తోంది. ఏపీ ప్రభుత్వంకు దగ్గరగా ఉండే కొందరికి ప్రాముఖ్యత దక్కిందని అంటున్నారు. 2014లో విడుదలైన మనం చిత్రం ఉత్తమ చిత్రంగా నిలువకపోవడం ఇందుకు ప్రధాన నిదర్శణంగా చెప్పుకోవచ్చు.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని, తెలుగు సినిమాకు కొత్త అందంను తీసుకు వచ్చి, ఒక విభిన్నమైన సినిమాగా నిలిచిన ‘మనం’కు ఉత్తమ చిత్రంగా కాకుండా ఉత్తమ రెండవ చిత్రంగా అవార్డు ఇవ్వడం ఆ సినిమాను అవమానించడమే అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏమాత్రం సందేశం లేని, భారీ యాక్షన్ సీన్స్ ఉండి, చంపుకోవడాలు, నరుకుకోవాడాలు ఉన్న సినిమా లెజెండ్‌కు అవార్డ్ ఇవ్వడం శోచనీయం అంంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఇదే చర్చ జరుగుతుంది. ‘మనం’ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు ఇచ్చి ఉంటే అవార్డుకే గౌరవంగా ఉండేది అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మనంకు ఉత్తమ రెండవ చిత్రంగా నంది రావడం పట్ల నాగార్జున సంతోషాన్ని వ్యక్తం చేశాడు.