Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై ఆకట్టుకోలేక పోతాయి. స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అంతో ఇంతో వసూళ్లను రాబడుతాయి. స్టార్ హీరోల సినిమాలే కాకుండా కొద్దిగొప్ప క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు కూడా మొదటి వారం రోజులు గౌరవప్రధమైన వసూళ్లను రాబడుతాయి. కాని వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఆఫీసర్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్నాయి. ఈ దశాబ్దపు అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచిందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇంత చెత్త సినిమాను తీసిన వర్మకు చెత్త అవార్డు ఇవ్వాల్సిందే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
టాలీవుడ్‌లో నాగార్జునకు ఒక స్టార్ హీరో అనే స్టార్‌డం ఉంది. ఆ స్టార్‌డంతో మొదటి వారంలో కనీసం అయిదు కోట్లు వసూళ్లు చేసే సత్తా ఉంది. సినిమా కనీసం యావరేజ్‌గా ఆడినా కూడా నాగ్ సినిమా సునాయాసంగా ఆ మొత్తంను వసూళ్లు చేస్తుంది. అదే సినిమా సక్సెస్ అయితే మొదటి వారం రోజుల్లో పది కోట్ల రూపాయలను వసూళ్లు చేయగలదు. యువ హీరోల సినిమాలు సైతం ఫ్లాప్ అయినా కూడా కోటికి పైగా వసూళ్లు సాధిస్తున్నారు. కాని ఇద్దరు ప్రముఖులు కలిసి చేసిన ‘ఆఫీసర్’ చిత్రం సంపూర్నేష్‌బాబు సినిమా స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టలేక పోయింది. మొదటి వారంలోనే కాదు, లాంగ్ రన్‌లో కూడా ఈసినిమా కనీసం కోటి రూపాయలను వసూళ్లు చేయలేక పోయింది. ఇంత దారుణమైన కలెక్షన్స్ ఈమద్య కాలంలో ఏ స్టార్ హీరోకు కాని, దర్శకుడికి కాని రాలేదు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే వర్మ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.