Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడటం జరిగింది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు అబ్బో, అయ్యో అంటూ మీడియాలో చెబుతూ అమాంతం అంచనాలు పెంచేశారు. కాని సినిమా విడుదల తర్వాత చూస్తే సినిమాలో మ్యాటర్ ఏం లేదు. ఈ చిత్రాన్ని దాదాపు పదిహేను భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సినిమాకు అంత సీన్ లేదు అంటూ స్వయంగా మెగా ఫ్యాన్స్ అనేశారు. దాంతో తెలుగుతోనే సరిపెట్టారు. అయితే బన్నీకి మంచి క్రేజ్ ఉన్న కేరళలో విడుదల చేయడం జరిగింది. ‘నా పేరు సూర్య’ విడుదలైన వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. కాని ఆ సినిమా విఫలం అవ్వడంతో కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్ అయిన కారణంగా తర్వాత సినిమా విషయంలో ప్రయోగం వద్దని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో ఈయన చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు గత సంవత్సరం ‘డీజే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ను దక్కించుకున్నారు. ఇప్పుడు అదే తరహా ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా హరీష్ శంకర్‌తో జరుగుతున్నాయి. త్వరలోనే వీరిద్దరి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. స్క్రిప్ట్ ఓకే అయ్యిందని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుందని, త్వరలో అనే విషయాలకు సంబంధించిన ప్రెస్ నోట్‌ను విడుదల చేయబోతున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.