విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు భారీ క్రేజ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను దక్కించుకున్న విజయ్ దేవరకొండ గత చిత్రం ‘నోటా’ ఫ్లాప్ అయినా కూడా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. ఈ ఓపెనింగ్స్ విజయ్ దేవరకొండ క్రేజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా ట్యాక్సీవాలా చిత్రంతో విజయ్ దేవరకొండ సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌కు ఆప్తుడు అయిన ఎస్ కే ఎన్ నిర్మించాడు. దాంతో ఈ సినిమా ప్రమోషన్ లో అల్లు అర్జున్ పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈనెల 11న పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక జరుగబోతుంది. అందుకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బన్నీ గతంలో బన్నీ వాసు కోసం ‘గీత గోవిందం’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక అంటూ మరోసారి విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా కార్యక్రమంకు రాబోతున్నాడు. గీత గోవిందం సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తప్పకుండా మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అంతా నమ్ముతున్నారు. ఈ చిత్రం చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈసారి రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంకు పోటీగా రాబోతుంది. ఈ చిత్రంతో పాటువిజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అనే చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.