Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ తీసుకున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖులు సిట్ ముందుకు ఒక్కరొక్కరుగా విచారణకు హాజరు అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు విచారణకు హాజరు అయిన అందరి నుండి కూడా సిట్ అధికారులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్థారించేందుకు శాంపిల్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మన సెలబ్రెటీలు చాలా ముదుర్లు. డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుని మరీ విచారణకు హాజరు అయినట్లుగా తెలుస్తోంది.
సహజంగా అయితే డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్థారించేందుకు రక్తం, జుట్టు, గోర్లను శాంపిల్స్ గా తీసుకుంటారు. వీరి నుండి కూడా వాటిని తీసుకోవడం జరిగింది. కాని వాటిని పరీక్షిస్తే వారు డ్రగ్స్ తీసుకోనట్లుగా రిపోర్ట్ వస్తుందని సిట్ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. వారు విచారణకు హాజరు అయ్యే ముందు అలోవేరా జ్యూస్‌ను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్నారు. అలా తీసుకున్న సమయంలో రక్తంలో ఉన్న డ్రగ్స్ మూలాలు మాయం అవుతాయి. ఇక జట్టు మరియు గోర్లు కూడా వివిధ రసాయనాలను వాడి డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలకుండా చేస్తున్నారు. ఇప్పటి వరకు హాజరు అయిన ప్రతి ఒక్క సెలబ్రెటీ కూడా అదే విధంగా శాంపిల్స్ ఇచ్చారు అంటూ సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వారిని డోపింగ్ యంత్రం ద్వారా పరీక్షించాలని నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల ఎంతగా ప్రయత్నించినా, ఎన్నో నెలల క్రితం డ్రగ్స్ తీసుకున్నా కూడా వెళ్లడి అవుతుంది.
మరిన్ని వార్తలు: