అమర్ అక్బర్ ఆంటొని రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

amar-akabar-antony-review

నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్: థమన్
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్

amar-akbar-antonyమాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. వరస పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్లకు ఇది రీఎంట్రీ లాంటి సినిమా. అందుకే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి పూర్వ వైభవం సంపాదించాలని శ్రీనువైట్ల కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, పాటల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడంతో ఈ సినిమా కూడా అదే తరహా హిట్ అందుకుంటుందని ఆశిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ నేడు(నవంబర్ 16న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఇన్నిరోజులూ ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీనువైట్లకు రవితేజ సక్సెస్ అందించాడో లేదో రివ్యూలో చూద్దాం.

కధ :

amar-akbar-antony-movie-release

అమర్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. అయితే బయటకు వచ్చిన అమర్ వరుసగా ఫెడో ఫార్మా కంపెనీ డైరెక్టర్ లని చంపుతూ ఉంటాడు. ఈ కేసులని సాల్వ్ చేయడానికి ఎఫ్బీఐ ఆఫీసర్ బల్వర్దన్ రంగంలోకి దిగుతాడు. అయితే ఇదే సమయంలో చిన్నతనంలోనే నా అనుకునే వాళ్ళు అందరినీ పోగొట్టుకుని ఒక ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న పూజ(ఇలియానా) ను హోల్ అమెరికా తెలుసు అసోసియేషన్ సభల్లో కలుసుకుంటాడు అమర్, అయితే తన కున్న డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ కారణంగా ఆమెకు అక్బర్ గా పరిచయం అవుతాడు. అయితే పూజకు కూడా అదే జబ్బు ఉన్న నేపధ్యంలోఈ సారి డాక్టర్ గా దర్శనం ఇస్తాడు. అయితే ఈ ఫెడో ఫార్మా కంపెనీ డైరెక్టర్ ల హత్యలకు కారణం అమర్ అని తెలుసుకున్న ఎఫ్బీఐ ఆఫీసర్ ఈ విషయం ఫార్మా డైరెక్టర్ లలో మిగిలి ఉన్న అతనికి ఉప్పందిస్తాడు. అయితే అమర్ ఎవరు ? పూజ అలియాస్ ఐశ్వర్యతో అతనికి సంబంధం ఏంటి ఫెడో ఫార్మా కంపెనీ డైరెక్టర్లని అమర్ ఎందుకు చంపుతాడు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

raviteja-amar-akbar-antony

దర్శకుడు శ్రీను వైట్ల మళ్ళీ తన టోటల్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ రూపంలో మనముందుకు తీసుకొచ్చాడు. తనకు బాగా కలిసొచ్చిన హీరో రవితేజతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కాగా కథ అలాగే కధనాల విషయంలో శ్రీను వైట్ల ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాప్ మొత్తం హీరో హీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్, వారి మధ్య ఉన్న కామన్ విషయం గురించి రివీల్ చేయడానికే సరిపోయింది. తన తల్లిదండ్రులను చంపిన విలన్లను అంతం చేసేందుకు రవితేజ ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడు అనే అంశాలతో సినిమాపై ఆసక్తి పెంచినా ఎడిటింగ్ టేబుల్ మీద శ్రద్ద పెట్టకపోవడం స్పష్టంగా కనిపించింది, అలాగే సినిమా కదా చాలా రొటీన్ అంశం కావడంతో ప్రేక్షకులకి పెద్దగా ఎక్కే అవకాశం కనపడడం లేదు.

raviteja-movies

అలాగే కామెడీ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు అప్డేట్ అయినా ప్రేక్షకులని అతి తక్కువ సార్లు మినహా నవ్వించలేకపోయింది. తనకు ఉన్న జబ్బు గురించి తెలుసుకుని షాక్‌లో ఉండిపోతాడు రవితేజ. ఇక్కడ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. అటు సెకండాఫ్‌ను పూర్తిగా రివెంజ్‌ డ్రామాగా మనకు చూపించాడు వైట్ల. సునీల్, వెన్నెల కిషోర్ వంటి చాలా మంది కమెడియన్లు ఉన్నా తన మార్క్ పూర్తి కామెడీని అందించలేకపోయాడు వైట్ల. అమర్, అక్బర్, ఆంథోనీ అనే మూడు పాత్రలతో ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు. ఇక ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో పెద్దగా పస లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. నిజానికి సినిమా అయిపోయి పేర్లు పడేదాకా ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. కానీ నిరాశతోనే బయటకు వచ్చారు.

విశ్లేషణ :

raviteja-iliayana

నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఈ సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో లాక్కొచ్చాడు. మూడు పాత్రల్లో తనదైన మార్క్ కామెడీ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఇక చాలా రోజుల తరువాత గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో నటించడంతో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని ఆశించిన ప్రేక్షకులకి నిరాశే ఎదురయ్యింది. సన్నటి నడుముతో ఆమె అందాన్ని చూసిన సగటు తెలుగు ప్రేక్షకుడు ఆమెయిన్ ఇలా చూసి తట్టుకోవడం కష్టమే అయితే బొద్దుగా ఉన్నప్పటికీ ఇలియానా తన యాక్టింగ్‌తో మెప్పించింది. కమెడియన్లు చాలా మంది ఉన్నా పెద్దగా వాడుకోలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగానే చేశారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా రిచ్ గా చూపించారు. థమన్ సంగీతం సోసోగా ఉండి పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయినా రీ-రికార్డింగ్ బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ మొత్తానికి సక్సెస్ కోసం శ్రీనువైట్ల, రవితేజ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

raviteja

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : అమర్ అక్బర్ అంటోనీ – రిచ్ టచ్ ఇచ్చిన రొటీన్ రివెంజ్ స్టోరీ
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.25 / 5