Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంకర్ అనసూయ బుల్లి తెరతో పాటు వెండి తెరను కూడా హీట్ ఎక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జబర్దస్త్‌తో పాటు పలు టీవీ షోలు చేస్తోన్న అనసూయ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు తాజాగా జబర్దస్త్ షో గురించి పాజిటివ్‌గా, ఆదికి మద్దతుగా మాట్లాడిన విషయం తెల్సిందే.
అనసూయపై ఇప్పటికే పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినా కూడా అభిమానులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లోకి వచ్చిన ఈ అమ్మడు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
ఆ సందర్బంగా ఒక అభిమాని హాయ్ అను ఆంటీ, ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహించిన అనసూయ నువ్వే గడ్డాలు మీసాలు పెంచుకుని నాకు అంకుల్‌లా ఉన్నావు. నీకు నేను ఆంటీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరిని ఎలా పిలవాలి అనే విషయాన్ని నేర్చుకో, ఆంటీ అనేది బూతు పదంలా తయారు అయ్యిందని, కొందరు ఆ పదాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తున్నారు అంటూ అనసూయ అసహనం వ్యక్తం చేసింది. అయితే 40కు అటు ఇటుగా ఉన్న అనసూయ ఆంటీ కాకుండా ఇంకా అమ్మాయేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అనసూయ విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అనసూయను ఆంటీ అంటూ సంబంధించిన కుర్రాడు మాత్రం సైలెంట్ అయ్యాడు.