Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క హీరోయిన్గా అశోక్ దర్శకత్వంలో వంశీ మరియు ప్రమోద్‌లు యూవీ క్రియేటషన్స్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘భాగమతి’. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘భాగమతి’ చిత్రం తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. ట్రైలర్ మరియు పోస్టర్స్‌తో ఈ సినిమా ‘అరుంధతి’ రేంజ్లో ఉంటుందని అంతా ఆశించారు. అందుకే ఓవర్సీస్లో ఈ చిత్రం తప్పకుండా మంచి వసూళ్లు సాధిస్తుందని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ భావించారు. మినిమం రెండు మిలియన్ల డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో భారీ మొత్తంకు కొనుగోలు చేయడం జరిగింది. 160కు పైగా స్క్రీన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.
సినిమా విడుదలైన వెంటనే నెగటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఓవర్సీస్లో ఈ చిత్రంకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో కనీసం 7 లక్షల డాలర్లను కూడా వసూళ్లు చేయడంలో విఫలం అయ్యింది. లాంగ్ రన్లో మిలియన్ మార్క్ దాటుతుందనే నమ్మకం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. భాగమతి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలు తప్పవని ఇప్పటికే తేలిపోయింది. అయితే అది ఎంత అనేది మూడు నాలుగు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. అనుష్కపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అదే మాదిరిగా ఉంది. మొదటి మూడు రోజులు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా, సోమవారం నుండి భాగమతికి కష్టాలు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.