Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క ఓ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. ఇది చదవగానే అందరూ ఏముంది అనుష్క శర్మ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమలో పడిందని అందరికీ తెలిసిన సంగతే చెప్తున్నారనుకుంటారు. కానీఈ కబురు విరాట్ కోహ్లీ ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి కాదు. మన టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ అనుష్కా శెట్టి గురించి. ఏ ఇంటర్వ్యూలోనూ వ్యక్తిగత జీవితం, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాల గురించి పెద్దగా మాట్లాడని అనుష్క తొలిసారి ఓ క్రికెటర్ పై తనకున్న అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తంచేసింది. కర్నాటకకు చెందిన అనుష్క బెంగళూరుకు చెందిన రాహుల్ ద్రావిడ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తన చిన్నతనం నుంచే తాను ద్రావిడ్ ను విపరీతంగా అభిమానించేదాన్నని, అతనంటే పిచ్చని..ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని అనుష్క తెలిపింది.
అనుష్కే కాదు..ఎంతో మంది హీరోయిన్లు క్రికెటర్లను ఎంతగానో ఆరాధిస్తారు. పాత తరం నటి జయసుధకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చెన్నైలోని చిదంబరం స్టేడియంకు వెళ్లి మ్యాచ్ లు ప్రత్యక్షంగా చూసేవారు జయసుధ. అప్పట్లో పాకిస్థాన్ మేటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను ఆమె చాలా ఇష్టపడేది. ఈ విషయాన్ని జయసుధే స్వయంగా చాలా సందర్బాల్లో వెల్లడించారు. క్రికెట్ చూస్తూ ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లిచేసుకోవాలని కలలు కనేదాన్నని జయసుధ తెలిపారు. క్రికెట్ విషయంలో హీరోయిన్లు సాధారణ మహిళా అభిమానులకు ఏ మాత్రం తీసిపోరు. ఇప్పటి అమ్మాయిలు కోహ్లీ, భువనేశ్వర్, పాండ్య వంటి ఆటగాళ్లను తమ డ్రీమ్ బాయ్స్ గా ఎలా భావిస్తున్నారో..ఏ తరానికి తగ్గట్టుగా …ఆ తరం క్రికెటర్లను అమ్మాయిలు ఆరాధించేవారు.