ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయే కన్నడ భామ అనుష్క ఈ మధ్య సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత గత ఏడాది అనుష్క ‘భాగమతి’తో ఆకట్టుకున్నారు. దీని తర్వాత ట్రీట్మెంట్ కోసం అనుష్క అమెరికా వెళ్లి వచ్చినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు కూడా దూరం అవుతున్నారని ఆమె వివాహం చేసేసుకుంటారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ ఆమె చాలా రోజుల తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహంలో తళుక్కుమన్నారు. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ‘సైజ్ జీరో’ తదితర సినిమాల్లో పాత్రల కోసం కాస్త బొద్దుగా మారిన అనుష్క కష్టపడి బరువు తగ్గారు. చాలా రోజుల తర్వాత నయా లుక్‌తో అభిమానులకు దర్శనమిచ్చారు.
ఆమె తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘అనుష్క ఈజ్ బ్యాక్’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఫొటోషూట్‌లో స్వీటీ మునుపటి లుక్‌లోకి మారి సందడి చేస్తున్నారు. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఓ అందమైన బీచ్ తీరంలో తీసిన అనుష్క ఫొటోషూట్‌కు సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేశాడు. ఆ వెంటనే స్వీటీ ఫొటోలు వైరల్‌గా మారాయి. మార్చి నెలలో అనుష్క కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి ‘సైలెన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా మూకీగా ఉంటునని కూడా వార్తలు వచ్చాయి, నిజమెంత అనేది వేచి చూడాలి.