Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వీటీ అనుష్క ‘సైజ్ జీరో’ చిత్రం కోసం చాలా ఎక్కువగా బరువు పెరిగిన విషయం తెల్సిందే. ఆ చిత్రం సమయంలో అనుష్క దాదాపు 90 కేజీల వరకు బరువు పెరిగింది. బరువు పెరగడం మరియు తగ్గడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. అందరిలాగే తాను బరువు పెరిగి ఆ వెంటనే తగ్గేయవచ్చు అని అనుష్క భావించింది. కాని షాకింగ్‌గా అనుష్క బరువు రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డా కూడా తగ్గలేక పోతుంది.
గత సంవత్సర కాలంగా అనుష్క తీవ్రంగా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ప్రయోజనం లేదు అంటూ సమాచారం అందుతుంది. ఆ మద్య అనుష్క ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో కనిపించాయి. అందులో అనుష్క చాలా నాజూకుగా మునుపటి రూపంలో కనిపించింది. దాంతో అనుష్క మళ్లీ స్వీట్‌గా తయారు అయ్యిందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాని అనుష్క తాజాగా ‘భాగమతి’ ఆడియో వేడుకలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.
అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం ఆడియోను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఆ వేడుకలో అనుష్క బొద్దుగా కనిపించింది. మీరు పైన చూస్తున్న ఫొటో నిన్న జరిగిన ‘భాగమతి’ ఆడియో విడుదల కార్యక్రమంకు సంబంధించిందే. ‘భాగమతి’ చిత్రంలో అనుష్క కాస్త బక్కగా కనిపించేందుకు విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగించినట్లుగా తెలుస్తోంది. అనుష్క లావు తగ్గకపోవడంతో ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాకపోవచ్చు. అందుకే ఇంకా గట్టిగా ప్రయత్నించి అనుష్క లావు తగ్గాలని, ‘ ప్రభాస్ బిల్లా’లో ఎలా అయితే ఉందో ఆ లుక్స్‌కు, ఆ వెయిట్‌కు వచ్చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అనుష్క లావు తగ్గేందుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.