Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కేంద్రం ఇస్తున్న విలువ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదని ఇట్టే అర్ధం అయిపోతుంది. అయితే అది నిజం కాదు. ఆంధ్రప్రదేశ్ కి కొద్ది నెలల్లో ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అది ఆంధ్రుల మీద ప్రేమతో కాదు. పోరాటాలకు ఫలితం అంత కన్నా కాదు. రాజకీయ వికృత క్రీడలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబుని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ లోపాయికారీగా తెరాస , వైసీపీ ల అండతో విభజన అంశాన్ని ముందుకు తెచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే చంద్రబాబు టార్గెట్ గా ప్రత్యేక హోదా ఇచ్చి సరికొత్త రాజకీయానికి తెర లేపుతోంది. ఆ రాజకీయం లో వైసీపీ అధినేత జగన్ బీజేపీ కి ప్రధాన అస్త్రం అయ్యే అవకాశం ఉందట. ఇంతకీ బీజేపీ వేస్తున్న ప్లాన్ ఏంటో తెలుసా ?
బీజేపీ ప్రాపకం కోసం వైసీపీ స్వయంగా నేలమాళిగలో దాచిపెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ స్వయంగా చంద్రబాబు మీద వరస ట్వీట్స్ చేస్తున్నారు. ఇదేదో కాకతాళీయం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ నుంచే బీజేపీ సరికొత్త వ్యూహం మొదలు అవుతోంది. సోషల్ మీడియా ద్వారా ముందుగా చంద్రబాబు హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని విరివిగా ప్రచారం చేస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ పూర్తి అయ్యాక ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు. ఆ పై ఓ నెల పాటు ఆంధ్రప్రదేశ్ ని బంద్ లు , ఆందోళనలతో హోరెత్తిస్తారు. అప్పుడు కేంద్రం వైసీపీ పోరాటానికి దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటిస్తుంది. ఆపై అంతా అనుకున్నట్టే 2019 ఎన్నికలకు బీజేపీ , వైసీపీ పొత్తుతో ప్రజల ముందుకు వెళతాయి. దీంతో చంద్రబాబు రాజకీయంగా దెబ్బ తింటారు . ఇదీ ప్రస్తుతం మోడీ అండ్ కో వేస్తున్న మాస్టర్ ప్లాన్ . వైసీపీ అధినేత జగన్ అందులో ఓ పాన్. చంద్రబాబు విక్టిమ్. అయితే రాజకీయాల్లో వ్యూహాలన్నీ సక్సెస్ కావొచ్చు , కాకపోవచ్చు. అందులోను సవాళ్ళను అవకాశంగా మలుచుకునే చంద్రబాబు ని తక్కువ అంచనా వేయలేం. మొత్తానికి ప్రత్యేక హోదా అంశం కేంద్రబిందువుగా రానున్న రోజుల్లో రసవత్తర రాజకీయానికి తెర లేవబోతోంది.