‘సర్కార్‌’ వివాదం.. రాజీకి సరే అన్న మురుగదాస్‌…!

Sarkar Movie Reached 250 Crore

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కార్‌’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. అయితే ఈ చిత్రం కథ నాది అంటూ ఒక రచయిత మీడియా ముందుకు వచ్చాడు. అతడి వాదనను కొట్టి పారేసిన మురుగదాస్‌ విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టుకు సదరు రచయిత వెళ్లాడట. దాంతో మురుగదాస్‌ సంచలన నిర్ణయానికి వచ్చాడు.

sankar

మురుగదాస్‌ కథ వివాదానికి కారణం అయిన వ్యక్తితో రాజీకి ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. రచయితకు 30 లక్షలు ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో పాటు, ఆయనకు కథలో క్రెడిట్‌ ఇవ్వాలని మురుగదాస్‌ నిర్ణయించుకున్నాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో కోర్టు గొడవలు వద్దనే ఉద్దేశ్యంతో మురుగదాస్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

vijay-movies

విజయ్‌ సరసన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించింది. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటిస్తోంది. మొన్నటి వరకు సొంత కథ అంటూ చెప్పుకొచ్చిన మురుగదాస్‌ ఇప్పుడు రాజీకి వచ్చి ఆయనకు డబ్బులు ఇవ్వడం ఏంటని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

sankar-movies