Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అటు చైనా, ఇటు పాకిస్థాన్ కొరకరాని కొయ్యల్లా మారిన తరుణంలో సర్జికల్ స్ట్రైక్స్ కు సిద్ధమని ఆర్మీ ప్రకటించింది. చొరబాట్లు, ఉగ్రదాడులతో రెచ్చగొట్టాలని చూస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఓసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసినా పాకిస్థాన్ కు బుద్ధి రాలేదని, కావాలంటే మరోసారి నియంత్రణ రేఖ దాటతామని సైన్యం స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన సర్జికల్ దాడుల్ని ఆర్మీ సమర్థిస్తోంది. గతంలో చెప్పకుండా చేసేవాళ్లమని, ఈసారి చేశాక చెప్పామని, అంతకంటే వేరే తేడా ఏమీ లేదంటున్నారు ఆర్మీ అధికారులు. కానీ సైన్యం ఉన్నట్లుండి ఇలాంటి ప్రకటన చేయడం వెనుక డోక్లాం ఘటనతో పాటు పెరుగుతున్న పాక్ ఉగ్రదాడులు కూడా కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓవైపు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఒకేసారి చైనా, పాక్ తో వార్ కు రెడీ కావాలని సైనికులకు ఆదేశాలిచ్చిన సమయంలోనే.. ఆర్మీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు భారత్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక ఆయుధాలను అతి వేగంగా సమకూర్చుకుంటోంది. ఇంత పెద్ద ఎత్తున ఆయుధకొనుగోళ్లకు ఏదో వ్యూహం ఉందని అందరూ అనుమానిస్తున్నారు.
మరిన్ని వార్తలు: