Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవ్యాంధ్రకు మరో భారీ కంపెనీ తరలివచ్చింది. జన్మభూమి రుణం తీర్చుకుంటూ అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామం సమీపంలోని ఆదర్శ పారిశ్రామిక పార్క్ లో అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఈ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. రూ. 135 కోట్ల పెట్టుబడితో 75 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటుచేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో 2,295 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద బస్సుల తయారీదారు అశోక్ లేల్యాండ్ అని, ఇండియాలో తమ ఎనిమిదివ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ఇక్కడ పెడుతున్నారని చెప్పారు. ఈ ప్లాంట్ లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని తెలిపారు. అశోక్ లేలాండ్ కోసం రైతులు తమ భూములు ఉదారంగా ఇచ్చారని చెప్పారు. మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతంగా మారబోతోందని, అశోక్ లేలాండ్ ఏర్పాటుతో మల్లవల్లి స్వరూపం పూర్తిగా మారిపోతుందని చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఏడాది అశోక్ లేలాండ్ 70వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, సీఎం కోరిక మేరకు ఏపీలో యూనిట్ పెట్టాలని నిర్ణయించామని, ప్రభుత్వ సహకారం కారణంగానే త్వరగా శంకుస్థాపన చేసుకుంటున్నామని ఆ సంస్థ ఎండీ వినోద్ దాసరి చెప్పారు.