Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ లో సంచలనాల మోత మోగించిన బాహుబలి 2 ఇప్పుడు జపాన్ లో అడుగుపెడుతోంది. ఈ నెల 29న బాహుబలి 2 జపనీస్ వెర్షన్ ను జపాన్ లో విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది. జపాన్ బాహుబలి పోస్టర్లను విడుదలచేసింది. ఈ సినిమా అక్కడ సెన్సార్ పూర్తిచేసుకుని జి సర్టిఫికెట్ పొందింది. జపాన్ లో జి సర్టిఫికెట్ అంటే భారత్ లో యు సర్టిఫికెట్ తో సమానం.
భారత్ లో బాహుబలి 2 సృష్టించని రికార్డు లేదు. రూ. 1500 కోట్ల క్లబ్ లో చేరిన తొలి భారత చిత్రం బాహుబలి 2నే. మొత్తం రూ. 1700 కోట్లు ఈ చిత్రం వసూలు చేసింది. ఇక జపాన్ లో సత్తా చాటనుంది. ఇప్పటిదాకా జపనీయులకు భారతీయ సినిమాలంటే గుర్తొచ్చేది తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలే. బాహుబలి 2 విడుదల తర్వాత జపాన్ లో ప్రభాస్ కు కూడా రజనీ స్థాయిలో అభిమానులు ఏర్పడతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. బాహుబలి 1, 2 సినిమాలతో ప్రభాస్ ఇప్పటికే జాతీయస్థాయి హీరో అయ్యారు. జపనీస్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ తర్వాత ఆయన అంతర్జాతీయ హీరోగా గుర్తింపు పొందుతారని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.