Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మద్య కాలంలో సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ మీట్‌లు, థ్యాంక్స్ మీట్‌లు అంటూ జరుపుకుంటున్నారు. సినిమా పబ్లిసిటీలో భాగంగా ఆ వేడుకలు జరుపుతూ చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను అంతో ఇంతో బతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇలాంటి వేడుకలు మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. నందమూరి బాలకృష్ణ నటించిన ‘జైసింహా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ ఏమాత్రం రాలేదు. ఓవర్సీస్‌లో జైసింహా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. అయినా కూడా ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సందర్బంగా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పేందుకు అంటూ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
థ్యాంక్స్ మీట్ జరిగిన వారం లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరింది అంటూ ఒక కార్యక్రమంను నిర్వహించారు. జైసింహా 50 కోట్ల కలెక్షన్స్ సాధించిందో లేదో పక్కన పెడితే ఆ కార్యక్రమంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తన ప్రతి సినిమా కూడా రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉందని, రికార్డులు అనేవి నాకు కొత్త కాదు, గతంలో తాను నటించిన సమరసింహారెడ్డి చిత్రం 32 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడటం జరిగిందని, ఆ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయింది అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు.
తన రికార్డుల గురించి బాలయ్య చెప్పుకోవడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. తన ప్రతి సినిమా కూడా రికార్డే అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు జోకులు వేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య చేస్తున్న ప్రతి సినిమా కూడా ఫ్లాప్‌ల పరంపర కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలయ్య తన సినిమా గురించి రికార్డులు అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.