Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ మనవరాలిగా, నందమూరి బాలకృష్ణ కూతురిగా, ఏపీ సీఎం చంద్రబాబు కోడలిగా, ఏపీ మంత్రి లోకేష్ భార్యగా.. నారా బ్రాహ్మణికి ఎవరికీ లేనంత బ్యాక్ గ్రౌండ్ ఉంది. దీనికి తోడు ఆమె స్వతహాగా టాలెంటెడ్ కావడంతో.. ఆమె ఎక్కడకు వెళ్లినా నలుగుర్నీ ఇట్టే ఆకట్టుకుంటారు. అందుకే నారా బ్రాహ్మణిని పాలిటిక్స్ లోకి తేవాలని చంద్రబాబుకు టీడీపీ నేతలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి తన దక్షతతో హెరిటేజ్ గ్రూప్ ను అభివృద్ధి పథంలో నడిపితే.. బ్రాహ్మణి ఏకంగా హెరిటేజ్ ను కార్పొరేట్ గ్రూపులతో అనుసంధానం చేశారు. రిలయెన్స్ లాంటి సంస్థతో వ్యాపార బంధం దృఢమయ్యేలా పక్కా వ్యూహాలు అమలుచేశారు. బ్రాహ్మణి వచ్చాక హెరిటేజ్ షేర్ శరవేగంగా పెరుగుతోంది. రాజకీయ విమర్శకులు దీనికి బాబు అధికారమే కారణమని చెప్పినా.. అసలు సంస్థలో ఏం జరుగుతుందో బిజినెస్ సర్కిల్స్ లో వారిని అడిగితే నిజాలు తెలుస్తాయి.
ఇప్పటివరకూ అడపాదడపా ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు, హెరిటేజ్ గ్రూప్ కార్యకలాపాల్లో మాత్రమే కనిపించిన బ్రాహ్మణి.. తొలిసారి ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. బాలకృష్ణ షూటింగులకూ ఏనాడూ రాని బ్రాహ్మణి.. నందమూరి హీరోలెవరూ రాని ఓ అవార్డ్ ఫంక్షన్ కు హాజరై హీరోయిన్లకు మించి ఎట్రాక్షన్ తెచ్చుకున్నారు. నారా బ్రాహ్మణితో కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారంటే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలిసిపోతోంది.
మరిన్ని వార్తలు: