Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల ముందు వరకు సినిమాలు వస్తే తప్ప అందులో ఉండే సీన్స్ ఏంటి అనేవి తెలిసేది కాదు. పోస్టర్‌లు వేస్తే అందులో హీరో ఎలా ఉంటాడు, హీరోయిన్ ఎలా ఉండబోతుంది అనే విషయాు తెలిసేవి. కాని కాలం మారిపోతుంది, టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు ట్రైలర్ అంటూ విడుదల చేయడం మొదలు పెట్టారు. ట్రైలర్ చూస్తే సగం సినిమా అర్థం అవుతుంది. కొన్ని ట్రైలర్‌లు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచడంతో పాటు కొన్ని ట్రైలర్‌లు సినిమా ఇదేనా అన్నట్లుగా ఉండేవి. ట్రైలర్‌లు కనీసం రెండు నిమిషాల నుండి అయిదు నిమిషాల వరకు ఉంటాయి. ఇక ట్రైలర్‌ల తర్వాత టీజర్‌లు. కొన్ని సెకన్ల నిడివితో ఉండే ఈ టీజర్‌లు ప్రస్తుతం సందడి చేస్తున్నాయి.
ట్రైలర్‌లు, టీజర్‌లు సినిమాలపై ఒక అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. కాలం మారుతుంది, అలాగే సినిమా పద్దతి, పబ్లిసిటీ విధానం కూడా మార్చుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ట్రైలర్, టీజర్‌ల తర్వాత స్టంపర్‌లు వస్తున్నాయి. ఈ స్టంపర్‌లు ఏంటి అనేది ఇంకా తెలియదు. తెలుగులో మొదటి సారిగా బాలయ్య సినిమాకు స్టంపర్ విడుదల కాబోతుంది. బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ను మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో సినిమా స్టంపర్‌ను విడుదల చేయబోతున్నారు. స్టంపర్ విభిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇది సక్సెస్ అయితే మిగిలిన వారు కూడా అంతా ఇదే ఫాలో అవుతారేమో. టాలీవుడ్‌లో ముందు ముందు అన్ని సినిమాలకు స్టంపర్‌లను విడుదల చేస్తారేమో చూడాలి.
మరిన్ని వార్తలు
ఛార్మిపై కానిస్టేబుల్ చేయి
సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం
వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.