Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : అనుష్క, ఉన్ని ముకుందన్ , ధనరాజ్ , ప్రభాస్ శ్రీను
నిర్మాతలు : వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్, జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం : అశోక్
సినిమాటోగ్రఫీ: మది. ఆర్, సుశీల్ చౌదరి
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్ : తమన్ ఎస్.ఎస్
అనుష్క కెరీర్‌లో ‘అరుంధతి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ చిత్రం తర్వాత అంతటి గుర్తింపును అనుష్కకు ‘భాగమతి’ చిత్రం తీసుకు వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు మరియు సినీ వర్గాల వారు పదే పదే చెబుతూ వస్తున్నారు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ చిత్రం గురించి సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతుంది. రెండు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుష్క రెండు విభిన్న పాత్రల్లో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. హర్రర్ నేపథ్యంలో చాలా వైవిధ్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్‌కు అత్యంత సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అనుష్క ‘బాహుబలి’ చిత్రంలో దేవసేనగా నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు ‘భాగమతి’గా ఆ పాత్రను మరపించి, మరింతగా గుర్తింపును దక్కించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రం కోసం ఒక పాత బంగ్లా సెట్టింగ్‌ను వేయించడం జరిగింది. దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఆ సెట్టింగ్‌ను రూపొందించారు.
సినిమాకు సంబంధించిన 75 శాతం షూటింగ్ ఆ సెట్టింగ్‌లో జరిగిందని సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంటే సినిమాలో ఎక్కువ శాతం హర్రర్ ఉంటుందని దీన్ని బట్టి అర్థం అయ్యింది. అనుష్కకు ఈ చిత్రంతో మళ్లీ ఆఫర్లు వస్తాయని సినీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2018 మొదటి కమర్షియల్ సూపర్ హిట్‌ను ‘భాగమతి’ దక్కించుకుంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. మరి అనుష్క అందరి అంచనాలను అందుకుంటుందా అనేది రేపు సినిమా విడుదలైన తర్వాత తేలిపోనుంది.