కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధి దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేషన్ కార్డు లబ్ధి దారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం శాశ్వతంగా ఉంటుందని, ఈ పథకాన్ని రద్దు చేసే సాహసం ఎవరు చేయలేరని సీఎం రేవంత్ అన్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.