తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 ముగిసింది. అంతా అనుకున్నట్లుగానే ఈ సీజన్ విజేతగా కౌశల్ నిలిశాడు. గేమ్ పట్ల అతడి ఫోకస్ మరియు ఇతరత్ర విషయా కారణంగా అతడికి భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినది. కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఫామ్ అయ్యి కౌశల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కౌశల్ ఆర్మీ భారీ ఎత్తున క్యాపెయినింగ్ చేయడంతో పాటు, భారీగా ఓట్లు వేయడంతో కౌశల్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్‌కు వెంకటేష్ గెస్ట్‌గా వచ్చాడు.
ఫైనల్ ఎపిసోడ్‌లో విజేతగా నిలిచిన కౌశల్ ఏకంగా 50 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. వెంకటేష్ చేతుల మీదుగా కౌశల్ ఈ ప్రైజ్ మనీని అందుకున్నాడు. ఆ తర్వాత కౌశల్ మాట్లాడుతూ ఈ విజయం కౌశల్ ఆర్మీది అంటూ వ్యాఖ్యానించాడు. కౌశల్ తనకు వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. బిగ్‌బాస్ స్టేజ్‌పైనే కౌశల్ ఈ విషయాన్ని ప్రకటించాడు. కౌశల్ ఈ మంచి మనసుతోనే బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు అంటూ అంతా కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.