Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీకి చింత చచ్చినా పులుపు చావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సీన్ లేదని తెలిసినా ఎగిరెగిరి పడుతూనే ఉంది. ఉత్తరాదిలో పారినట్లుగా అమిత్ పాచికలు ఇక్కడ పారవని ఆయనకు తెలియడం లేదు. కేవలం టీడీపీతో పొత్తు ఉన్నందుకే బీజేపీకి గత ఎన్నికల్లో తెలంగాణలో ఐదు సీట్లు, ఏపీలో అప్పనంగా రెండు మంత్రి పదవులు వచ్చిపడ్డాయి. వీటితో సరిపెట్టకుండా తమ బలాన్ని అతిగా ఊహించుకుంటోంది కమలం.
అదే మంటే ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును, ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ గా రాం మాధవ్ ను పెట్టేస్తే.. ఇక తమదే అధికారమనే పిచ్చి భ్రమల్లో ఉంది బీజేపీ. అసలు ఏపీలో బీజేపీ అంటేనే జనం మండిపడుతున్నారు. ఈ దశలో బాబుకు దూరం జరిగితే.. అది ఆయనకే మంచిది. ఒకవేళ ఏపీలో కొంతమందికి బాబు ఇష్టం లేకపోతే.. వారు వైసీపీకి ఓటేస్తారు కానీ.. బీజేపీకి వేయరు. ఈ మూలసూత్రం కమలనాథులకు అర్థం కావడం లేదు.
రాం మాధవ్ అయినా, సోము వీర్రాజు అయినా పేపర్ టైగర్సే కానీ.. జనంలో పేరున్నవాళ్లు కాదు. ఏపీలో బీజేపీ ఫేస్ ఎవరో కూడా జనానికి తెలియదు. అలాంటి దుస్థితిలో పార్టీ కొట్టుమిట్టాడుతుంటే.. నేతలు అధికారం గురించి ఆలోచించడం పెద్ద సాహసమే. తెలంగాణలో కూడా పార్టీ గ్రూపులుగా విడిపోయి ఉంది. వీళ్లు అధికారంలోకి వచ్చే మాట దేవుడెరుగు.. గతంలో వచ్చిన సీట్లు తెచ్చుకుంటే చాలంటున్నారు నిపుణులు.
మరిన్ని వార్తలు: