Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
BJP President Amit Shah Is Regularly In Touch With Fadnavis
ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేనతో సంబంధం లేకుండా నెగ్గుకొచ్చారు మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేల పరంగా ఆయన బలం ఇంకా మెజార్టీ మార్కు దాటలేదు. ఇంకా శివసేనపై ఆధారపడే సర్కారును నడిపిస్తున్నారు. అటు శివసేన చూస్తే.. మేం తుమ్మితే మీ ముక్కు ఊడిపోతోందని బెదిరిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఏ క్షణమైనా ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోక తప్పదని జోస్యం చెబుతున్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ మెరుగుపడిందన్న సంకేతాలు అందుతున్నాయి. ఎన్సీపీ కూడా జత కలిస్తే.. మళ్లీ ఆ కూటమే అధికారంలోకి వస్తుందని కొందరు లెక్కలు వేస్తున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో ఫడ్నవీస్ మోస్ట్ పాపులర్ లీడర్ అన్న సంగతి వారు మరిచిపోతున్నారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. శివసేన గతంతో పోలిస్తే బాగా బలహీనపడిందని, వివాదాస్పద స్టేట్ మెంట్లతో మనుగడ సాధిస్తోందని ఫడ్నవీస్ వర్గం ఫైరౌతోంది.
మధ్యంతర ఎన్నికలు వస్తే ఎలా గెలవాలో తమకు బాగా తెలుసనే రేంజ్ లో ఫడ్నవీస్ గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారట. అదే నిజమైతే బీజేపీకి మధ్యంతర గండం తప్పినట్లే. కానీ మహారాష్ట్రప్రజలు ఎంతవరకూ ఫడ్నవీస్ ను ఆదరిస్తారన్నది ప్రధాని మోడీని కూడా టెన్షన్ పడుతున్నారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర లాంటి బలమైన రాష్ట్రం పట్టు జారకూడదని ఆయన భావన. అందుకే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా రెగ్యులర్ గా ఫడ్నవీస్ తో టచ్ లో ఉంటున్నారట.
మరిన్ని వార్తలు :






