Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు బ్రాహ్మణి రాజకీయ రంగప్రవేశానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆమెని లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్న బాబు అందుకు అనువైన సీటు కోసం ఎప్పటినుంచో వేట మొదలెట్టారు.తొలుతగా ఆమెని విజయవాడ లోక్ సభ బరిలో నిలపాలని భావించారట.అందుకే మంత్రిగా వున్న లోకేష్ కి విజయవాడ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి గా బాధ్యతలు ఇచ్చారు.కానీ విజయవాడలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్టు గుర్తించిన టీడీపీ హైకమాండ్ బ్రాహ్మణికి అంతకన్నా సేఫ్ సీట్ కావాలని వెదికితే గుంటూరు కనిపించిందట.అందుకే సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ని ఈ స్థానం నుంచి మార్చడం మీద బాబు దృష్టిపెట్టారట.
గుంటూరు ఎంపీ గా వున్న గల్లా జయదేవ్ ని పిలిపించుకున్న బాబు ఆ స్థానంలో బ్రాహ్మణి ని పోటీ చేయించే ఆలోచన ఉందని చెప్పారట.గుంటూరు ఎంపీ స్థానాన్ని వదులుకుంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని జయదేవ్ కి బాబు ఆఫర్ ఇచ్చారట.అయితే జయదేవ్ అసెంబ్లీకి వెళ్లడం మీద తనకు ఆసక్తి లేదని,పార్లమెంట్ మీదే దృష్టి ఉందని బాబుకి వివరించారట . అయితే గల్లా కి రాజ్యసభ ఇచ్చి ఎంపీ గా పంపుతామని బాబు హామీ ఇచ్చారట.అప్పుడు గుంటూరు లో బ్రాహ్మణిని గెలిపించే బాధ్యత కూడా అన్ని రకాలుగా జయదేవ్ చూసుకోవాలని చంద్రబాబు సూచించారట.అందుకు జయదేవ్ కూడా ఓకే అన్నారట.ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా బ్రాహ్మణి గుంటూరు నుంచి పోటీ చేయకపోతే జయదేవ్ కి అదే సీటు యధాతధంగా ఇవ్వడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
మరిన్ని వార్తాలు:
పిలుపులు పెళ్ళికి కాదు భోజనానికా?
విజయసాయి జ్యోతిష్కుడా?