స్మార్ట్ సిటీకి బ్రిటన్ ఎసరు

britain company report create obstacles for smart cities

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ఖరారయ్యారు. ఆయన విజయం కూడా లాంఛనమే. ఆయన లేకపోతే ఏపీ ఏమైపోతుందనోనని ఆయన శ్రేయోభిలాషులు తెగ బాథపుడతున్నారు. కానీ ఇప్పుడు ఆయన మరో కల కూడా భగ్నమైంది. అదే స్మార్ట్ సిటీ. వెంకయ్య పట్టణాభివృద్ధికి వచ్చాక మోడీ మనసు చూరగొనేలా స్మార్ట్ సిటీల్ని పట్టాలకు ఎక్కించారు. ఇదీ సంగతి. కానీ బ్రిటన్ సంస్త ఇచ్చిన నివేదిక దానికీ ఎసరు పెట్టింది.

ఉన్న సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకుస్మార్ట్ సిటీ ప్రాజెక్టు చేపట్టారు. కానీ అదేదో రాష్ట్రాలకు కొత్త నగరాలిస్తున్నంత బిల్డప్ ఇచ్చింది. తీరా చూస్తే నలభై అంతస్తుల బిల్డింగులు కడతామని ఊదరగొట్టారు. సిటీలకు ర్యాంకులిచ్చి, రాష్ట్రాలకు పోటీపెట్టి.. అదో ప్రిస్టేజ్ ఇష్యూ లాగా క్రియేట్ చేశారు. ఇలాంటి సమయంలో బ్రిటన్ సంస్థ ఇచ్చిన నివేదిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకే ఎసరు పెట్టింది.

అనవసరంగా స్మార్ట్ సిటీల్లో నలభై అంతస్తులు బిల్డింగులు కడితే.. ఇంకేముందని , పర్యావరణానికి ముప్పని చెబుతున్నారు బ్రిటన్ సంస్థ ప్రతినిధులు. ఎడాపెడా అభివృద్ధి పేరుతో ఇలా చేస్తే సిటీలు నాశనమౌతాయని, అలాంటప్పుడు ఇంకేం సాధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో కేంద్రం కూడా పునరాలోచనలో పడింది. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బంది తప్పదని భావిస్తోంది.

మరిన్ని వార్తలు

హర్మన్ ప్రీత్ కు ఉద్యోగం ఇవ్వలేదా..?

వర్మకు ఎక్సైజ్ చెక్

విశాఖ స్కామ్ ఏ తీరానికి చేరునో..?